ETV Bharat / state

ఆన్​లైన్​లో మట్కా... గుట్టు రట్టు చేసిన పోలీసులు

author img

By

Published : Aug 26, 2021, 8:14 PM IST

ఆన్​లైన్​లో మట్కా నిర్వహిస్తున్న ముఠా.. గుట్టును రట్టు చేశారు హిందూపురం పోలీసులు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హిందూపురం వన్​టౌన్ పోలీసులను డీఎస్పీ రమ్య అభినందించారు.

నిందుతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందుతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆన్​లైన్​లో మట్కా యాప్​లు తయారు చేసి మట్కా నిర్వహిస్తున్న ముఠా గుట్టును అనంతపురం జిల్లా హిందూపురం పోలీసులు రట్టు చేశారు. హిందూపురానికి చెందిన బొట్టు మంజు 2019లో ఆఫ్ లైన్​లో మట్కా నిర్వహించేవాడు. అప్పుడు పోలీసుల నుంచి తప్పించుకున్న బొట్టు మంజు హైదరాబాదులోని యానిమేషన్ ఇంజనీర్ సహాయంతో మట్కా నిర్వహణ కోసం సరికొత్తగా గా 2 వెబ్ పేజీలను తయారు చేయించుకున్నాడు. అనంతరం ఆన్​లైన్​లో మట్కా నిర్వహణ కొనసాగిస్తున్నాడు.

ఇదీ పసిగట్టిన హిందూపురం వన్ టౌన్ పోలీసులు.. ఆన్​లైన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. మంజు ఆన్​లైన్ వెబ్ పేజీలు తయారుచేసిన యానిమేషన్ ఇంజనీర్ షబ్బీర్​తో పాటు మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పెనుకొండ సబ్ డివిజన్ డీఎస్పీ రమ్య వివరాలను వెల్లడించారు.

మట్కా నిర్వహిస్తూ గంజాయి విక్రయిస్తున్న 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.11,10,000 నగదు, 16 సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్, 1370 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అన్​లైన్ మట్కా నిర్వహణ గుట్టు రట్టు చేసిన హిందూపురం వన్​టౌన్ పోలీసులను డీఎస్పీ రమ్య అభినందించారు.

ఇదీ చదవండి: సెప్టెంబర్‌ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.