అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణానికి చెందిన దంపతులు.. సుధాకర్, సుమ. వీరికి ఐదుగురు సంతానం. అయితే సుధాకర్ కొవిడ్ బారినపడి మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. ఈ క్రమంలో కష్టకాలంలో ఉన్న వాళ్లను ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ఛైర్ పర్సన్ జయం రవీంద్రతోపాటు పలువురు కౌన్సిలర్లు కలిసి నిత్యావసర సరకులు, రూ. 10వేల నగదు అందజేశారు.
కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయం త్వరగా అదేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకురావాలని కోరారు.
ఇదీ చదవండి..