అనంతపురం జిల్లా గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాన నీరంతా పొలాల్లో చేరి పంటలు జలమయమయ్యాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటలు వర్షం పాలు కావటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఈ ఏడాది మొదట్లో సకాలంలో వర్షాలు పడినందున పంటకు మంచి దిగుబడి వస్తుందని రైతన్నలు ఆశించారు. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో పత్తి, వేరుశనగ పంటలు నీటమునిగాయి. రామరాజుపల్లి, గజరాంపల్లి, నీలూరు, పెద్దవడుగూరు, కాసేపల్లి, చిన్న వడుగూరుల్లో వందల ఎకరాల్లో పంట నీటనానుతోంది.
ఇవీ చదవండి..