గతంలో ఎన్నడూ లేనంతగా ఉరవకొండలో రికార్డు స్థాయిలో 92 మిల్లీ మీటర్ల వర్ష పాతం పట్టణంలో నమోదైంది. సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివరామిరెడ్డి కాలనీలో వంక ఉద్ధృతంగా ప్రవహించింది. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
రోడ్లుపై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహించగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు ఇళ్లల్లోకే కాకుండా చేనేత మగ్గాల గుంతల్లోకి వర్షపు నీరు చేరింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఇంటి ముందు ఉన్న కాలువలు నిండి ఇళ్లలోకి నీళ్లు వచ్చి మగ్గం గుంతల్లోకి వెళ్లాయి. దాదాపుగా వెయ్యికి పైగా చేనేత మగ్గాల్లోకి నీళ్లు వెళ్లాయి. పరిసర ప్రాంతాల పొలాలు.. నీట మునిగాయి.
ఇదీ చదవండి: