Heavy rain in Anantapur: అనంతపురం నగరంలో భారీ వర్షం కురుసింది. రెండు రోజులుగా చిన్నపాటి చినుకులతో తడి చేసిన నేలపై ఈరోజు మధ్యాహ్నం నుంచి దాదాపు గంట పాటు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం పడిన ప్రతిసారి కొన్ని కాలనీలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వరదల కారణంగా ఇబ్బంది పడిన నగర ప్రజలు.. వర్షం రాకతో భయాందోళన చెందుతున్నారు. వరద నీరు సక్రమంగా పారేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: