ETV Bharat / state

పోలీసు వలయంలో తాడిపత్రి..ఎక్కడికక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు - తాడిపత్రిలో భారీగా బందోబస్తు

వైకాపా, తెదేపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, దాదాపు 50 మంది ప్రత్యేక విభాగం పోలీసులతో గట్టి బందోబస్తును అమలు చేస్తున్నారు.

పోలీసు వలయంలో తాడిపత్రి
పోలీసు వలయంలో తాడిపత్రి
author img

By

Published : Dec 26, 2020, 6:15 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం వైకాపా, తెదేపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. జేసీ, కేతిరెడ్డి నివాసాల వద్ద పోలీసులు చెక్ పోస్టుల ఏర్పాటు చేసి జనసంచారం లేకుండా చేశారు. అలాగే పట్టణంలోకి బయటి ప్రాంతాల నుంచి ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాకుండా ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గస్తీ చేపట్టారు. ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, దాదాపు 50 మంది ప్రత్యేక విభాగం పోలీసులతో గట్టి బందోబస్తును అమలు చేస్తున్నారు.

జేసీ సహా 17 మందిపై కేసు

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మరో 15 మందిపై కేసులు నమోదయ్యాయి. కులంపేరుతో దూషించారని వైకాపా కార్యకర్త మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తేజమూర్తి తెలిపారు.

గొడవకు వారే కారణం

జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య ఘర్షణ జరగడానికి ప్రధాన కారణం వలీ భాషా, దాసరి కిరణ్ అనే వ్యక్తులేనని డీఎస్పీ చైతన్య స్పష్టం చేశారు. వారిద్దరిపై సుమోటోగా కేసులు నమోదు చేశామన్నారు. తమ ఉన్న ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా ఇరు వర్గాలకు చెందిన వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. త్వరలోనే ఇరు వర్గాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకొనున్నట్లుగా తెలిపారు. ఇంతవరకూ తెదేపా నేతలు ఎవరూ తమకు ఫిర్యాదులు ఇవ్వలేదని వారు ఫిర్యాదు చేస్తే..వైకాపా నాయకులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇదీచదవండి

తాడిపత్రిలో 144 సెక్షన్​... జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.