కరోనా నివారణ చర్యలపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అనంతపురంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు.
కొవిడ్ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఆర్డీటీ, సవెరా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యం, భోజనం, ఇతర వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వం ప్రతి రోజు ఒక్కో బాధితుని కోసం 500 రూపాయలు ఆహారం కోసం ఖర్చు చేస్తోందని మంత్రి వివవరించారు. వైద్యంతో పాటు ఇతర సేవల్లో సమస్యలుంటే...1902, 1440, 104 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఇదీ చదవండి
ఎస్ఈసీగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్