వరాలిచ్చే తల్లిగా పేరొందిన కర్నూలు జిల్లా నందవరం చౌడేశ్వరి అమ్మవారి ప్రతి రూపాన్ని అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు మగ్గంపై తయారు చేశారు. ధర్మవరం రామ్‌నగర్‌కు చెందిన చేనేత పట్టు చీరల వ్యాపారి పామి శెట్టి లక్ష్మీనారాయణ ఈ చీరను తయారు చేయించాడు. చేనేత డిజైనర్ వెంకటేష్ అమ్మవారి ప్రతిరూపాన్ని పట్టు చీరపై రూపొందించారు. ఎనిమిది గజాల పట్టు చీర పై అమ్మవారి ప్రతిమ వివిధ డిజైన్లలో వేశారు. నందవరం చౌడేశ్వరి అమ్మవారికి పట్టుచీరను సమర్పించనున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదీ చూడండి కరోనా ఎఫెక్ట్: శ్రీవారి భక్తులకు థర్మల్ గన్‌తో పరీక్షలు