అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికురాలు రత్నమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మగ్గంపై పట్టు చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్న ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
మగ్గాల వైండింగ్ మిషన్ గదిలో బూజు దులిపి చెత్త శుభ్రం చేస్తామని చీపురుతో వెళ్లిన రత్నమ్మ ఎంతకీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చి ఆమె మరిది, కుమారుడు ఇద్దరూ వెళ్లి చూశారు. అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు.
మూత్ర పిండాల సమస్యతో ఆమె కొంతకాలం కిందట శస్త్ర చికిత్సలు చేయించుకోగా.. మోకాళ్లు నొప్పులతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటోందని కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని కిందకు దింపించి శవ పరీక్ష కోసం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: