అనంతపురం జిల్లా ధర్మవరంలో శానిటైజర్ తాగి వీరేష్ అనే చేనేత కార్మికుడు మృతి చెందాడు. పట్టు చీరల పాలిష్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరేశ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శానిటైజర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆస్పత్రులకు వెళ్తూ.. వాహనాల్లోనే మృతి చెందుతున్న బాధితులు