అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాలు, ఇళ్లల్లోకే కాకుండా చేనేత మగ్గాలు గుంతల్లోకి కూడా వర్షపు నీరు చేరింది. ఉరవకొండలో కురిసిన భారీ వర్షానికి ఇంటి ముందు ఉన్న కాలువలు నిండి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పట్టణంలో దాదాపుగా 30 నుంచి 40 చేనేత మగ్గాల్లోకి నీళ్లు చేరాయి. ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం భారీ వర్షాలు రావడంతో అటు రైతులకు, ఇటు చేనేతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నేత నేసిన చీరలు నీటిపాలు కావడంతో నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో వానకి ఇంటి వెనక గోడ కూలిపోయింది. రాత్రి ఇళ్లలోకి నీరు చేరడంతో వెనకాల ఉన్న గోడ అమాంతం వెనక వైపునకు పడిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్నవారు ఉలిక్కిపడి లేచారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ఇదీ చూడండి.
కోరిక తీర్చలేదో ఉద్యోగం పోతుంది... వాలంటీర్కు వైకాపా నేత బెదిరింపు