ETV Bharat / state

కూలి రేట్లు పెంచాలని హమాలీల నిరసన - anantapur dst taja updates

అనంతపురం జిల్లాలో కూలి రేట్లు పెంచి ప్రమాద బీమా కల్పించాలని కోరుతూ హమాలీలు మోకాళ్లపై నిలబడి నిరసన చేశారు. కరోనా సమయంలో రెండు డ్యూటీలు చేస్తున్నా తమను ప్రభుత్వం గుర్తించలేదని ఇప్పటివరకూ కనీసం మాస్కులు పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడ్డవారికి 50లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

halalis protest in anantapur dst
halalis protest in anantapur dst
author img

By

Published : Aug 25, 2020, 10:57 PM IST

కూలి రేట్లు పెంచి ప్రమాద బీమా కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు అనంతపురం జిల్లాలో మోకాళ్ళపై నిరసన చేశారు. కరోనా సమయంలో కూడా హమాలీలు తమ ఆరోగ్యం గురుంచి ఆలోచించకుండా పని చేస్తున్నారని, వారికి ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్ఐ వెంటనే కల్పించాలని సీఐటీయూ అనంతపురం జిల్లా అధ్యక్షురాలు నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జనవరిలో పెంచాల్సిన కూలి రేట్లు నేటి వరకు పెంచలేదని...అనేకసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కరోనా నేపథ్యంలో నెలలో రెండు డ్యూటీలు చేస్తున్నామని ప్రభుత్వం నుంచి కనీసం మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వలేదన్నారు.

కరోనా బారిన పడ్డ వారికి 50 లక్షల బీమా సౌకర్యం వర్తింపచేసి.. ప్రతి సంవత్సరం దసరాకు ఇచ్చే బోనస్ 15వేల రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో సమ్మె చేయడానికైనా సిద్ధం అవుతామని తెలిపారు.

ఇదీ చూడండి

ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.