కూరగాయల వాహనంలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు నిందితులను అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి తిరుపతికి 114 బాక్సుల్లో గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా కొక్కంటి క్రాస్ వద్ద పట్టుకున్నారు. వీటి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు. మత్తు పదార్ధాలు, కర్ణాటక మద్యం, ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :