ETV Bharat / state

హత్య చేసి పరారయ్యాడు..జీపీఎస్​తో పట్టుబడ్డాడు

కేరళలో హత్య చేసి రైలు ఎక్కేశాడా యువకుడు... ఇది గమనించిన పోలీసులు నిందితుడి ఫోటోలను ఇతర రాష్ట్రాల్లోని అన్ని రైల్వే పోలీస్ స్టేషన్​లకు పంపిచారు. సాంకేతికత సాయంతో గుంతకల్లు పోలీసులు పట్టుకుని కేరళ పోలీసులకు అప్పగించారు.

gunthakallu railway police arrest kerala murder accused
కేరళలో హత్య చేసిన నిందితుడిని పట్టుకున్న గుంతకల్లు రైల్వే పోలీసులు
author img

By

Published : Mar 15, 2020, 9:46 AM IST

కేరళలో హత్య చేసిన నిందితుడిని పట్టుకున్న గుంతకల్లు రైల్వే పోలీసులు

కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాలోని పీచి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓవ్యక్తి హత్య కేసులో నిండితుడిని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

హత్య ఎలా జరిగిందంటే...

ఒడిశా రాష్ట్రానికి చెందిన సన్యాసినాయక్, అశోక్ కుమార్ కేరళలో భవన నిర్మాణ పనులు చేస్తుండేవారు. పనిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 11వ తేదీన సన్యాసి నాయక్ దారుణ హత్యకు గురయ్యాడు. అశోక్ హత్య చేసినట్లు కేరళ పోలీసులు భావించారు. మొదట్లో దీనిని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులకు మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో...పోలీసులు కేసు విచారణను సవాలుగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే నిందితుడు అశోక్ కుమార్ అక్కడినుండి పరారీ అయ్యాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడి ఫోటోలు ఆనవాళ్ళతో సహా కేరళ పోలీసులు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు.

ఇలా దొరికాడు...
ఈ సమాచారం అందుకున్న గుంతకల్లు రైల్వే రక్షక దళం, జీఆర్పీ పోలీసులు కేరళ నుంచి గుంతకల్లు స్టేషన్​కు వచ్చే అన్ని రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. 13వ తేదీ ఉదయం హత్య కేసులో నిందితుడైన అశోక్ కుమార్​ను కన్యాకుమారి ఎక్స్​ప్రెస్ రైలులో గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. జీపీఎస్ సాంకేతకతను ఉపయోగించి, హత్య జరిగిన 2 రోజుల్లోనే నిందితుడిని పట్టుకొని కేరళ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: కడప జిల్లాలో మహిళ దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.