గుంతకల్లు రైల్వే మోసానికి సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. కరోనాతో మృతి చెందిన విజయ్ స్టాన్లీ (ఆరోగ్య దాస్) ఈ మోసాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అతని ఇంటికి వెళ్లిన పోలీసులు.. సీడీలు, నకిలీ రిజిస్టర్లు, దేహ దారుఢ్య పరీక్షకు సంబంధించిన పత్రాలు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
రైల్వే శాఖలో ఎవరైనా సహకరించారా..
పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల్లో నకిలీ నియామక పత్రాలు ఉండడంతో.. వాటిపై సీళ్లు ఉండడంతో రైల్వే శాఖలో ఎవరైనా అతనికి సహకరించారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని సేకరించి రైల్వే విజిలెన్స్ అధికారులకు అందించారు. వారు దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.
సంబంధిత కథనం: రైల్వే కొలువుల పేరిట ఘరానా మోసం… రూ.10 కోట్లు వసూలు