ETV Bharat / state

ధర్మవరం రైల్వేస్టేషన్​లో గుంతకల్లు ఏడీఆర్​ఎం తనిఖీలు - ధర్మవరం రైల్వే స్టేషన్​ తాజా వార్తలు

ధర్మవరం రైల్వే స్టేషన్​లో గుంతకల్లు ఏడీఆర్​ఎం సైమన్ అకస్మిక తనిఖీ చేపట్టారు. డివిజన్ పరిధిలో తిరిగే రైళ్లలో చేపడుతున్న భద్రతా చర్యల గురించి ఆరా తీశారు. స్టేషన్​లో ప్లాట్​ఫాం టికెట్ బుకింగ్ కేంద్రంను పరిశీలించారు.

guntakal adrm visit dharmavaram railway station
ధర్మవరం రైల్వే స్టేషన్​లో తనిఖీలు
author img

By

Published : Dec 4, 2020, 7:05 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్​ను గుంతకల్లు ఏడీఆర్​ఎం సైమన్ తనిఖీ చేశారు. స్టేషన్​లో ప్లాట్​ఫాం టికెట్ బుకింగ్ కేంద్రం, ఆర్​పీఎఫ్ పోలీస్​ స్టేషన్​ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డివిజన్​ పరిధిలో రైళ్లలో చేపడుతున్న భద్రత చర్యల గురించి ఆరా తీశారు. స్టేషన్ అవరణలోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. నిఘా నేత్రాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఆయనతో పాటు అసిస్టెంట్ కమాండర్ అంజు కుమార్, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

'50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీకి తిరిగి వస్తాయా..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.