- పదేళ్ల తర్వాత:
రుతుపవనాలు, అల్పపీడనాలు, తుపాన్ల ప్రభావంతో అనంతపురం జిల్లాలో అనూహ్యంగా భూగర్భజలాలు పెరిగాయి. జూన్ నుంచి నవంబరు మధ్య కురిసిన వానలకు రికార్డు స్థాయిలో వృద్ధి చెందాయి. నవంబరు ముగిసేసరికి 10.77 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. పదేళ్ల తర్వాత ఇంతమేర భూగర్భ జలాలు నమోదు కావడం విశేషం. 2011 జనవరిలో 10.22 మీటర్లుగా నమోదైంది. రుతుపవనాలకు ముందు (మే చివరి) జిల్లాలో సగటున 23.06 మీటర్ల లోతులో నీటిమట్టాలు ఉండేవి. నవంబరు చివరి నాటికి సగటున 12.29 మీటర్లు పైకి ఎగబాకాయి. అంటే మే నుంచి నవంబరు వరకు పెరిగిన నీటిమట్టం 10.77 మీటర్లు.
నవంబరు నాటికి సాధారణ వర్షపాతం 491.5 మిల్లీమీటర్లు కాగా.. 747.3 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. నవంబరు చివరి నాటికి 52 శాతం వర్షపాతం అదనంగా నమోదైంది. ఈ ఏడాది వర్షాల వల్ల 504.80 టీఎంసీల నీరు వానరూపంలో పడింది. అందులో 60.58 టీఎంసీలు భూగర్భ జలాలుగా మారాయి.
* అత్యధిక లోతులో నీరు లభ్యమవుతున్న గ్రామం: తలుపుల
* అతి తక్కువ లోతులో భూగర్భజలాలు ఉన్న గ్రామం: ఆవుల తిప్పయ్యపల్లి (పెద్దవడుగూరు)
- వివిధ మండలాల్లో గల భూగర్భ జల పరిధి:
భూగర్భజల గణన అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మూడు మీటర్లలోపు భూగర్భజలం ఉన్నవి 5 మండలాలు, 3 నుంచి 8 మీటర్ల లోపు 22, 8 నుంచి 15 మీటర్లలోపు 16, 15 నుంచి 30మీటర్ల లోపు 17, 30 మీటర్ల కన్నాఎక్కువ లోతుల్లో నీటి మట్టాలు కల్గినవి 3 మండలాలు ఉన్నాయి.
* 30 మండలాల్లో నీరు సురక్షిత స్థాయిలో ఉంది. అలాగే 33 మండలాలు స్వల్పంగా భూగర్భజల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
- నీరు పుష్కలంగా లభిస్తున్న మండలాలు:
తాడిపత్రి, గుంతకల్లు, సీకే పల్లి, ఉరవకొండ, ముదిగుబ్బ, పెద్దవడుగూరు, ధర్మవరం, గుత్తి, గార్లదిన్నె, కనగానపల్లి, పుట్లూరు, యల్లనూరు* ఒత్తిడిని ఎదుర్కొంటున్న మండలాలు: గాండ్లపెంట, తలుపుల, మడకశిర, రొద్దం, లేపాక్షి, గుడిబండ, అగళి, తనకల్లు, హిందూపురం, అమరాపురం, శెట్టూరు, రొళ్ల