ETV Bharat / state

అక్రమంగా నిల్వఉంచిన వేరుశనగ విత్తనాల పట్టివేత

అనంతపురం జిల్లా బిల్లూరువాండ్లపల్లిలో అక్రమంగా నిల్వఉంచిన 34 సంచుల వేరుశనగ విత్తనాలను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు.

వేరుశనగ
author img

By

Published : Jun 30, 2019, 11:18 PM IST

అక్రమంగా నిల్వఉంచిన వేరుశనగ విత్తనాల పట్టివేత

వేరుశనగ విత్తనాలు దొరక్క రైతులు అల్లాడుతుంటే కొందరు అక్రమార్కులు వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు మాయమాటలు చెప్పి వారి దగ్గరి నుంచి కొనుగోలు చేసిన విత్తనాన్ని బహిరంగమార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారులు పక్కా సమాచారంతో పలు చోట్ల దాడులు చేసి సబ్సిడీ విత్తనాన్ని పట్టుకున్నారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం బిల్లూరువాండ్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 34బ్యాగుల వేరుశనగను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటకకు తరలిస్తున్న మరో 9బ్యాగులను వ్యవసాయశాఖ ఏడి, జేడీలు ఈతోడు వద్ద పట్టుకున్నారు. వీరికి ఈ విత్తనం ఎవరు విక్రయించారు.. ఎక్కడికి తరలిస్తున్నారన్నదానిపై విచారణ చేపట్టారు. విత్తనం దొరకని ఇలాంటి పరిస్థితుల్లో రైతులెవరూ సబ్సిడీ విత్తనాన్ని విక్రయించుకోవద్దని అధికారులు సూచించారు. అవసరమైన వారు మాత్రమే విత్తనం తీసుకోవాలన్నారు. సబ్సిడీ విత్తనం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

దారుణం: జింకను చంపిన వేటగాళ్లు

Intro:ap_knl_71_30_patient_died_andolana_ab_AP10053

కర్నూలు జిల్లా ఆదోని లో రాజప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో రాజప్ప మృతిచెందాడని ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన చేశారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు డాక్టర్లు ఎవరు లేకుండా..... టీ విరామం కోసం అరగంట పాటు బయటికి వెళ్లారని....అత్యవసర చికిత్స జరగక పోవడంతో మృతి చెందాడని బంధులు తెలిపారు.

బైట్,
బంధువు,ఆదోని.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.