అనంతపురం జిల్లా ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు 24 రోజుల పాటు సేవలందించిన కదిరి వైద్యుడికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. డాక్టర్ మున్వర్ భాషకు వైద్యులు, సిబ్బంది, స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు కదిరి నుంచి అనంతపురం ఆస్పత్రికి డాక్టర్ మున్వర్ భాష వెళ్లారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ధైర్యంగా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించి వచ్చిన వైద్యుడిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు హారతి ఇస్తూ సాధారంగా ఇంట్లోకి ఆహ్వానించారు.
ఇవీ చూడండి...