అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ హెల్త్ సెంటర్లో రూ.13 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి ఈ నెల 23 న మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అక్కడి ఏర్పాట్లను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాభై పడకల నుంచి వంద పడకలకు పెంచుతూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాయదుర్గంతో పాటు పరిసర మండలాల నుంచి వందలాది మంది సిహెచ్సిలో వైద్య సేవలు పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి పర్యటనలో నాయకులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కోరారు.
ఇదీ చదవండి