సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో కళకళలాడాలని కోరుతూ.. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో గోమాత కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సనాతన హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ సృష్టిలోని ప్రతి ప్రాణిలో దైవత్వాన్ని చూడడం ద్వారా శాంతి నెలకొంటుందని.. సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.
గోవును దేవతగా ఆరాధించే మనదేశంలో గోమాత కల్యాణాన్ని నిర్వహిస్తూ గోమాత విశిష్టత తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వధూవరుల స్థానంలో ఉన్న ఆవు, ఎద్దులను పూజించారు.
ఇదీ చదవండి: