ETV Bharat / state

పిడుగుపాటుకు 18 మేకలు మృతి - అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం

పిడుగుపాటుకు గురై 18 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామిడూరులో జరిగింది. మేకలన్నింటిని ఒకే దగ్గర నిలిపి ఉంచగా.. పిడుగు పాటుకు 18 మేకలు అక్కడిక్కక్కడే చనిపోయాయని యజమాని ఆవేదన చెందాడు.

goats died
18 మేకలు మృతి
author img

By

Published : May 11, 2021, 7:34 PM IST

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామిడూరు గ్రామ శివారులో సాయంత్రం పిడుగుపాటుకు 18 మేకలు మృత్యువాత పడ్డాయి. మామిడూరు గ్రామానికి చెందిన గంగాధర.. తనకున్న గొర్రెలన్నింటిని మేత కోసం గ్రామ సచివాలయం పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటిని నిలిపి.. తాను మరో చెట్టు కింద తలదాచుకున్నాడు.

ఒక్కసారిగా పిడుగుపడడంతో.. మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు... పిడుగుపాటుకు మేకలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాపరి గంగాధరకు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు వర్షాలు

'దురుద్దేశంతోనే సెంట్రల్​ విస్టాపై పిటిషన్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.