ETV Bharat / state

ఆ పరిశ్రమ భూములను వెనక్కి ఇచ్చేయండి: సీపీఎం - cpm party ananthapur news today

అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారం భూముల్లో... ఏవైనా ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని సీపీఎం ఆందోళన చేపట్టింది. భూములు ఇచ్చిన వారితో రైతులతో కలిసి ధర్నా నిర్వహించింది.

ఆ పరిశ్రమ భూములను వెనక్కి ఇచ్చేయండి : సీపీఎం

author img

By

Published : Oct 3, 2020, 5:34 PM IST

అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారం భూముల్లో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు.

లేదా వెనక్కివ్వండి..

కుదరని పక్షంలో నిర్వాసితులకే భూములను అప్పగించాలని సీపీఎం ఆధ్వర్యంలో భూ పోరాట కార్యక్రమాలను చేపట్టారు. రైతులు గత నెల రోజులుగా ఆందోళనలు చేపడుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని నేేతలు ధ్వజమెత్తారు.

ట్రాక్టర్ల సాయంతో..

ఆందోళనలో భాగంగా ఆయా భూముల్లో ట్రాక్టర్ల సాయంతో దున్నేందుకు యత్నించారు. ఈ క్రమంలో పరిగి పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నేతలను, భూ నిర్వాసిత రైతులను బలవంతంగా ఠాణాకు తరలించారు.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది: తెదేపా ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.