ETV Bharat / state

నాగిని డ్యాన్స్ చేసిన ప్రిన్సిపల్.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

అనంతపురం జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ కొవిడ్​ నిబంధనలను పాటించకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన ప్రిన్సిపాల్ సస్పెండ్​కు గురయ్యాడు. బయటి వ్యక్తులను బాలికల గురుకుల పాఠశాలలోకి తీసుకొచ్చి వేడుకలు నిర్వహించాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్​గా మారడంతో అధికారులు అతనిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.

principal suspension
సస్పెండైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
author img

By

Published : Jan 7, 2021, 10:59 PM IST

Updated : Jan 8, 2021, 1:28 PM IST

నూతన సంవత్సర వేడుకల్లో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ప్రభుత్వ కోవిడ్​ నిబంధనలను విస్మరించి.. కొత్త సంవత్సరం రోజున ప్రిన్సిపాల్ నాగరాజు బయటి వ్యక్తులను పాఠశాలలోకి అనుమతించి వేడుకలు నిర్వహించాడు. అంతటితో ఆగకుండా బాలికల ముందే అసభ్యకరంగా నృత్యాలు చేశారు.

ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్నవారు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట్లో ఈ వేడుకల వీడియోలు వైరల్​గా మారాయి. ఉన్నతాధికారులు ఆ వీడియోను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమం నిర్వహించారని ప్రిన్సిపాల్​​ను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు టీచర్లకు సైతం మెమోలు జారీ చేశారు.

ఇదీ చదవండి: యూకే స్ట్రెయిన్ కట్టడికి ప్రభుత్వం చర్యలు...

Last Updated : Jan 8, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.