అనంతపురం జిల్లా కదిరి మండలం కే బ్రాహ్మణ పల్లి వద్ద చెర్లోపల్లి జలాశయంలో ఆదివారం గల్లంతైన బాలిక మృతదేహం లభ్యమైంది. జలాశయం సందర్శనకు వచ్చిన అక్కచెల్లెళ్లు లోతును గుర్తించలేక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, ఈత గాళ్లు గాలించి ఒక బాలికను బయటికి తీశారు. ఆదివారం రాత్రి రెండో బాలిక ఆచూకీ లభించలేదు. నిన్న మధ్యాహ్నం బాలిక మునిగిన చోటే మృతదేహంపైకి తేలింది. సహాయక చర్యల్లో ఉన్న సిబ్బంది మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు.
ఇదీ చూడండి: కాలువలో బాలుడు గల్లంతయ్యాడని అనుమానం.. పోలీసుల గాలింపు