గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రతతో రోజూరోజుకి రోగాలు విజృంభిస్తున్నాయి. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం పాయకట్టులో డెంగీ జ్వరంతో రెండో తరగతి విద్యార్థిని వర్షిత మృతి చెందింది. వారం రోజుల కిందట చిన్నారికి జ్వరం సోకడంతో కదిరిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మళ్లీ జ్వరం రావడంతో ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. పాయకట్టులో అపరిశుభ్రత వల్ల దోమలు విపరీతంగా పెరిగి పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి.''పోలీసు అమరులారా వందనం.. మీ త్యాగాలకు వెలకట్టలేం''