ETV Bharat / state

నర్సంపల్లిలో విషాదం... ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి - child death in ananthapuram district

అనంతపురం జిల్లా నర్సంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ ఢీ కొని 14 నెలల చిన్నారి మృతి చెందింది. ఊహించని ఈ ఘటనతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

girl child death in accident at narsampalli ananthapuram district
ట్రాక్టర్ ఢీ కొని చిన్నారి మృతి
author img

By

Published : Aug 28, 2020, 10:54 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురం గ్రామానికి చెందిన అమల.. కనగానపల్లి మండలంలోని నర్సంపల్లిలోని తన పుట్టింటికి కుమార్తె శ్రీవిద్యతో కలిసి వెళ్ళింది. అమల సోదరుడు రమేష్.. పొలం నుంచి ట్రాక్టర్​పై ఇంటికి వస్తుండగా... మేనమామను చూసిన శ్రీవిద్య ట్రాక్టర్​కు ఎదురు వెళ్ళింది. ఇది గమనించని రమేష్... చిన్నారిని ఢీ కొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీ విద్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు రమేష్​పై కేసు నమోదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి.

'దేవాదాయ శాఖ నిధులను అమ్మఒడికి మళ్లిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.