ETV Bharat / state

ఆకట్టుకున్న లంకాదహనం కార్యక్రమం ... భారీగా హాజరైన భక్తులు - gavimatam brahmotsavalu latest news

ఉరవకొండలో గవిమఠం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి లంకాదహనం కార్యక్రమం నిర్వహించారు మఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి ప్రారంభించారు.

lanka dahanam
ఆకట్టుకున్న లంకాదహనం కార్యక్రమం ... భారీగా హాజరైన భక్తులు
author img

By

Published : Mar 25, 2021, 8:44 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి లంకాదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని మఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి ప్రారంభించారు. మఠం ప్రాంగణంలో నిర్దేశిత స్థలంలో లంకాదహనంలో భాగంగా బాణసంచా పేలుళ్లను చేపట్టారు. మిరుమిట్లు గొలిపే బాణసంచాను చూస్తూ భక్తులు సందడి చేశారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

మఠం ప్రాంగణం సాయంత్రం నుంచే కిక్కిరిసింది. లంకాదహనం ప్రాంగణాన్ని పోలీసులు సాయంత్రమే తమ ఆధీనంలో తీసుకుని, పటిష్ట నిఘాను కొనసాగించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ధరణిబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని మొహరించారు. ఈ వేడుక ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు చంద్రమౌళీశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగారు. ఉత్తరాధికారి డాక్టరు కరిబసవ రాజేంద్రస్వామి, తహసీల్దార్‌ మునివేలు, పెన్నహోబిలం ఆలయ ఛైర్మన్‌ అశోక్‌ కుమార్‌, ఆలయ సహాయ కమిషనరు రమేష్‌బాబు, అర్చకుడు విరూపాక్షి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వైభవంగా గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.