అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో చెత్తబుట్టలు లేని కారణంగా.. వైద్య సిబ్బంది వాడిన పీపీఈ కిట్లతోనే మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను తరలిస్తున్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు కనీస వసతులు సమకూర్చే పరిస్థితిలో లేరని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ సిబ్బందికి భద్రత దృష్ట్యా పీపీఈ కిట్లు అందించక పోగా… వాడి పడేసిన వాటిలో చెత్త తీసుకెళ్లాల్సిన దుస్థితి ఉందని ఆవేదన చెందారు. కొవిడ్ వ్యాప్తితో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… మున్సిపల్ సిబ్బంది పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: