అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలంలోని ఇనగళూరు, గాజుకుంట పల్లి గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశంతో ఈ రెండు గ్రామాల పరిధిలో ఒక్కసారిగా కుండపోతు వర్షం కురిసింది.
కదిరి సహా మిగతా ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రహదారుల్లో వర్షపు నీరు వాగులా ప్రవహించగా... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చోదకులు వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. అరగంటపాటు కురిసిన వర్షంతో సాగుకు మేలని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?: తెదేపా