ETV Bharat / state

బంగారు నాణేల పేరుతో ఘరానా మోసం.. రూ.8 లక్షలతో మాయం - అనంతపురం క్రైమ్ న్యూస్

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో నకిలీ బంగారు నాణేల పేరుతో ఘరానా మోసం జరిగింది. హైదరాబాద్​కు చెందిన పుల్లారెడ్డిని మోసగాళ్లు బురిడి కొట్టించారు.

fraud in ananthapuram district beluguppa

author img

By

Published : Jan 7, 2021, 9:52 AM IST

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో కేటుగాళ్ల చేతిలో హైదరాబాద్​కు చెందిన పుల్లారెడ్డి మోసపోయారు. 200 బంగారు నాణేలు ఉన్నాయని నమ్మబలికిన దుండగులు.. 8 లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు. అసలు సంగతిని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు పుల్లారెడ్డి.. బెలుగుప్ప ఎస్సై శ్రీనివాస్​కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్​కు చెందిన పుల్లారెడ్డి అనే వ్యాపారికి... బెలుగుప్పకు చెందిన కొంతమంది పరిచయం అయ్యారు. తమ వద్ద బంగారు నాణేలు ఉన్నాయని నమ్మబలికి వాటిని తక్కువ ధరకు ఇస్తామని చరవాణి ద్వారా పుల్లారెడ్డిని సంప్రదించారు. నాణేలు తీసుకునేందుకు అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం పరిధిలోని గుండ్లపల్లి వద్దకు రమ్మన్నారు. పుల్లారెడ్డి ఆ కేటుగాళ్లకు ఎనిమిది లక్షలు ఇచ్చి.. నాణేలు తీసుకున్నాడు. అందులో ఒక వ్యక్తి హైదరాబాద్ వరకు వస్తానని... అడగ్గా పుల్లారెడ్డి తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లగానే వాహనాన్ని ఆపమని చెప్పి ద్విచక్రవాహనంపై ఉడాయించాడు.

చివరికి.. తాను మోసపోయానని గ్రహించిన పుల్లారెడ్డి.. బేలుగుప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఏవీ సుబ్బారెడ్డికి 41సీఆర్​పీసీ కింద నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.