అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సారగుండ్లపల్లి వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంలో నలుగురు కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన గ్రామస్తులు వారిని నిర్బంధించారు. ఆలయంలోనికి వెళ్ళిన వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్ల అనుమానం వచ్చి వారి వద్ద ఉన్న వస్తువులను కింద పడేశారు. టేపు, స్కెచ్లు, గ్లౌస్, ఆలయ గోపురంపైన ఉంచే కలశం లాంటి వస్తువులను గుర్తించారు. వారిని నంబులపూలకుంట పోలీసులకు అప్పగించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి...'తలనొప్పి భరించలేక తనువు చాలించింది'