చిత్రావతి జలాశయం ముంపు గ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మరిమాకుల పల్లి గ్రామస్థులు పరిహారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జల దీక్ష చేపట్టారు. పునరావాస ప్యాకేజీ కింద 18 ఏళ్ళు నిండిన వారందరికీ పరిహారం వర్తింపజేయాలని అధికారులను కోరుతున్నా... పట్టించుకోవడంలేదని ఆందోళన చేపట్టారు. గ్రామ సమీపంలోని చిత్రావతి జలాశయంలో దిగి జలదీక్ష చేశారు. గ్రామంలోకి నీళ్లు వస్తున్నా.. తమకు పరిహారం ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన యువకులు నిరసన తెలిపారు. తమ గ్రామానికి పునరావాస ప్యాకేజీ వర్తింపజేసి న్యాయం చేయాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: 'స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ యుద్ధం చేయదు'