అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండల కేంద్రంలో.... హనుమంతప్ప, బసవరాజుకు చెందిన చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు కలపటంతో 13వేల చేపలు మరణించాయి. రెండున్నర లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలు పెద్దవి అయ్యాయని.. మరికొన్ని రోజుల్లో విక్రయానికి సన్నాహాలు చేస్తుండగా ఇలా జరిగిందని వాపోతున్నారు. బొమ్మనహాళ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: రాయితీ విత్తనాలు అమ్మగా వచ్చిన సొమ్ముతో.. వీహెచ్ఏ పరార్