Fire accident in train at Anantapur district: తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా ధర్మవరం పరిధిలోని కదిరి గేట్ వద్ద కొంత మంది గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లు పెట్టారు. పట్టాలపై ఉంచిన రాళ్ల పైనుంచి వెళ్లడంతో రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు రావడంతో అమరావతి ఎక్స్‌ప్రెస్ గంటపాటు నిలిచిపోయింది. మరో ఇంజిన్ జోడించిన తర్వాత రైలు బయలుదేరి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
