అనంతపురం మూడో పట్టణ పోలీసుల అప్రమత్తతతో భారీ అగ్నిప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ వుడ్ వర్క్ గోడౌన్ సమీపంలో మంటలు చెలరేగాయి. రాత్రి డ్యూటీలో ఉన్న మూడో పట్టణ పోలీసులు దీనిని గమనించి.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
సకాలంలో స్పందించిన వారు మంటలను అదుపు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ అగ్ని ప్రమాదానికి కారకులైన ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రూ. 50 లక్షలు విలువచేసే దుకాణాన్ని రక్షించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బందికి, మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై బలరాం ప్రోత్సాహంగా రూ.1000 చిరు బహుమతి అందించారు. నష్టం నుంచి దుకాణం యజమానులను కాపాడడంపై సంతోషం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దుకాణం యజమానులు సైతం పోలీసుల సమయస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: