అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలో 'రైతు విత్తనం-రైతు చెంతకే' అనే కార్యక్రమాన్ని జేడీఏ హాబీబ్ బాషా ప్రారంభించారు. రైతుల నుంచి విత్తనం కొనుగోలు చేశారు. రైతులు పండించిన వేరుశనగకు మద్ధతు ధర కల్పిస్తూ పండించిన పంటను రైతు చెంతకే చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జేడీఏ తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలోనే వేరుశెనగ పంటను పండిస్తారని అన్నారు. విత్తన కొరత రాకుండా గతంలో వేరుశెనగ విత్తనాలు బయట రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొనే వారని, ఈ విధంగా చేయడం వల్ల బయట వారు లబ్ధి పొందేవారని అన్నారు. అలా కాకుండా రైతులు పండించిన విత్తనాలను వారి దగ్గరే కొని...తిరిగి వారికి అవసరమైనప్పుడు తక్కువ ధరకు అమ్మడం ద్వారాా కర్షకులు లాభపడతారనే ఉద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జేడీఏ అన్నారు. గ్రామ స్థాయిలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీ చేస్తామన్నారు.
ఇవీ చదవండి...బార్బిక్యూ రైడ్...ఆహార ప్రియులకు ఓ సరికొత్త ట్రెండ్