అనంతపురం జిల్లాలో కరోనా ప్రభావంతో పండ్ల తోటల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేకపోవడం.. కొనుగోళ్లకు అవకాశం లేక నష్టపోతున్నారు. పంట కొనుగోలుకు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నా అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో పంట తీయడానికి కూలీలు దొరక్క.. చాలా మంది పొలాల్లోనే పంటను వదిలేసి వెళ్లిపోతున్నారు. మరోవైపు కొందరు రైతులు కన్నీటితో పంటను తొలగిస్తున్నారు.
ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం
పంట చేతికొచ్చే సమయంలో కరోనా తమను తీవ్రంగా నష్టపరిచిందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలని.. లేకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: