ETV Bharat / state

రైతు భరోసా పొందేందుకు.. రైతులకు తప్పని తిప్పలు !

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సాయం పొందేందుకు అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు నిధులు విడుదల చేసినా... అర్హులైన కొందరు రైతులకు ఆ సొమ్ము చేరడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోతోందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.

రైతులకు తప్పని తిప్పలు !
author img

By

Published : Oct 26, 2019, 5:48 AM IST

Updated : Oct 26, 2019, 10:20 AM IST

రైతులకు తప్పని తిప్పలు !

అనంతపురం జిల్లాలో రైతు భరోసా - పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు ఆరున్నర లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో ఇప్పటికీ లక్షా 78 వేల మందికి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఆందోళనకు గురైన రైతులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు అడిగిన ప్రతిసారి అవసరమైన పత్రాలను అందజేస్తున్నారు. అయినా తమకు రావలసిన డబ్బు రావడం లేదంటూ కర్షకులు ఆవేదన చెందుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే రేపూ.. మాపూ అంటూ అధికారులు సమాధానం దాటవేస్తున్నారని చెబుతున్నారు. బ్యాంకులో అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని వాపోతున్నారు.

సాంకేతిక కారణాల వల్లే కొందరు రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. రైతుల ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని... ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నవంబర్‌ 15లోగా అర్హులైన రైతులందరికీ లాభం చేకూరేలా చర్యలు చేపడతామని అనంతపురం జిల్లా వ్యవసాయశాఖ జేడీ చెబుతున్నారు.

ఇదీచదవండి

ముఖ్యమంత్రి​ ఆదేశాల అమలులో జాప్యం... సీఎంవో ఆగ్రహం

sample description
Last Updated : Oct 26, 2019, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.