పంట రుణాల రెన్యువల్ కోసం అనంతపురం జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. పెనుకొండ - పావగడ ప్రధాన రహదారిపై బైటాయించారు. రొద్దం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టించుకుని.. తాజాగా రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంకు మేనేజర్ రమేష్..... రైతులతో చర్చించారు. వడ్డీ కట్టించుకుంటామని అధికారులు హామీ ఇచ్చిన అనంతరం రైతులు ఆందోళన విరమించారు.
పంట రుణాల కొనసాగింపు కోసం రోడ్డెక్కిన రైతులు - రోడ్డెక్కిన రైతులు
పంట రుణాల రెన్యువల్ కోసం రైతులు రోడ్డెక్కారు. కెనరా బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. పాత రుణాలకు వడ్డీ కట్టించుకుని రుణాలు రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు.
farmers-darna
పంట రుణాల రెన్యువల్ కోసం అనంతపురం జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. పెనుకొండ - పావగడ ప్రధాన రహదారిపై బైటాయించారు. రొద్దం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టించుకుని.. తాజాగా రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంకు మేనేజర్ రమేష్..... రైతులతో చర్చించారు. వడ్డీ కట్టించుకుంటామని అధికారులు హామీ ఇచ్చిన అనంతరం రైతులు ఆందోళన విరమించారు.
Intro:పాత కక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు.
నరసరావుపేట మండలం లోని పెట్లూరి వారి పాలెం గ్రామంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని వైసీపీకి చెందిన యాదవ వర్గీయులు సోమవారం ఉదయం అదే గ్రామంలోని టీడీపీ కి చెందిన నాయుడు ల వర్గం మీదకు అనికొని విధంగా దాడి చేశారు.
Body: ఆ సంఘటనలో నాయుడు ల వర్గంలోని ఐదుగురికి తీవ్ర గాయాలవగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఉదయాన్నే ఎవరిపనులు వాళ్ళు చేసుకుంటుండగా ఒక్కసారిగా వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయుల ఇళ్ల పైకి దాడికి వచ్చారు. హఠాత్తుగా జరిగిన సంఘటనతో భయాందోళనకు గురైన టీడీపీ వర్గీయులు భార్యా, బిడ్డలతో తమ ఇళ్లలోకి వెళ్లి తలుపులు బిగించుకున్నారు. అయినా ఆగని వైసీపీ శ్రేణులు సుమారు 20 మంది వచ్చి టీడీపీ శ్రేణులు ఇళ్ల తలుపులు పగులగొట్టి ఇళ్లలోకి జొరబడి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. దాడిలో చిన్నా, పెద్దా చూడకుండా కొట్టడంతో మూడు ఇళ్లకు చెందిన పానుగంటి పెద శ్రీనివాసరావు, పానుగంటి వెంకటేశ్వర్లు, పానుగంటి సరస్వతి, శివశంకర్, ప్రసాదు లకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఇరువర్గాలకు గతంలో పొలంలో గేదెల విషయంలో వివాదం వున్నట్లుగా క్షతగాత్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో మా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరేం చేస్తారో చేసుకోండి అంటూ తమపై దాడి చేశారని క్షతగాత్రులు అన్నారు.
Conclusion:తలలు పగిలి, కాళ్ళు విరిగి తీవ్రంగా గాయపడ్డ వారిని వెంటనే నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. క్షతగాత్రుల వద్ద ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై బ్రహ్మం వివరాలు అడిగి ఫిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.