పంట రుణాలు రెన్యువల్‌కు సంబంధించిన టోకెన్లు తీసుకునేందుకు ఉదయం నుంచే బ్యాంకు ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్... పంట రుణాలు రెన్యువల్ చేపట్టింది. లాక్ డౌన్ కారణంగా రోజుకు 50 మంది రైతులకు మాత్రమే రుణాల రెన్యువల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 50 మంది రైతులకు బ్యాంకు సమయానికి ముందే టోకెన్లు ఇస్తున్నారు. వీటిని తీసుకొనేందుకు ఉదయం నుంచే రైతులు బ్యాంకు ఎదుట నిరీక్షిస్తున్నారు. బ్యాంకు అధికారులు 9 గంటల వరకు రానందున కొందరు వెనుతిరిగి వెళ్లారు.
ఇదీ చదవండి : 'కౌలు రైతులకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావాలి'