రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి... ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కర్ణాటకలోని శివమొగ్గ పేలుళ్లలో కాపు రామచంద్రారెడ్డి భాగస్వామ్యం ఉందని శ్రీనివాసులు ఆరోపించారు.
రాయదుర్గం నియోజకవర్గం మాఫియా డాన్ చేతుల్లోకి పోతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నియోజకవర్గంలో నాలుగు పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాలు ఉండగా.. కేవలం ఒకదానికి మాత్రమే అనుమతి ఉందన్నారు. దీని వెనుక కాపు రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. కాపు ధన దాహానికి ఎంత మంది అమాయకులు బలి కావాలి అని ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్కు ఫిర్యాదు చేస్తామని.. పూర్తిస్థాయిలో విచారణ చేసి కాపు రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాలవ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: