తాళాలు బద్దలుకొట్టారు... బంగారం దోచేశారు అనంతపురం జిల్లా పామిడి గుప్తా కాలనీలో దొంగలు అలజడి రేపారు. రంగస్వామి రెడ్డి అనే రైతు ఇంటి తాళాలు బద్దలుకొట్టి 15 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి, 50 వేల నగదు దోచుకెళ్లారు. గత రాత్రి రంగస్వామి రెడ్డి పొలానికి వెళ్లగా, ఆయన భార్య మేడపై నిద్రపోయింది. ఆ సమయంలోనే దొంగతనం జరిగింది. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన రంగస్వామిరెడ్డి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి అనుమానం పడ్డాడు. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి చోరీ జరిగిందని నిర్దరించుకొని పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు చోరీ జరిగిన తీరు పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇదీ చదవండి :
పాత కక్షలతో.. నాటు తుపాకితో కాల్చాడు!