farmer had approached the court: అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కత్తివారిపల్లికి చెందిన చెన్నకేశవరెడ్డి భూమిలో మునగలవారిపల్లి నుంచి కత్తివారిపల్లికి రహదారి మంజూరైంది. పనులు ప్రారంభానికి ముందే రైతు తన పొలం నుంచి రోడ్డు వేయవద్దంటూ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. తప్పనిసరైతే పరిహారం ఇవ్వాలని కోరాడు. ఇవేమీ పట్టించుకోని అధికారులు.. హడావిడిగా రోడ్డు పనులు ప్రారంభించారు.
farmer had approached the court: ఆవేదన చెందిన రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. రోడ్డుపనులు నిలిపివేయాలని కోరాడు. ఈలోపే కాంట్రాక్టర్... రైతు పొలంలో రోడ్డు కోసం ఇసుక, కంకరు రాళ్లను పోయడంతో... ఆగ్రహించిన రైతు జేసీబీ సాయంతో తన పోలం వద్ద వేసిన కంకరు రాళ్లను తవ్వేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని... రోడ్డును తవ్వొదంటూ రైతు చెన్నకేశవరెడ్డితో వారించారు. మరోసారి అధికారులకు మీ అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. ఈ క్రమంలో పోలీసులు, రైతు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. రైతుకు నచ్చజెప్పిన పోలీసులు... జేసీబీని అక్కడి నుంచి పంపేశారు.
ఇదీ చదవండి:
Municipal Workers Protest: పారిశుద్ద్య కార్మికుల 'చలో విజయవాడ'.. అడ్డుకున్న పోలీసులు