ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

విద్యుత్ షాక్‌తో రైతు మృతి
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
author img

By

Published : Apr 27, 2021, 1:14 PM IST

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామంలో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు సుధాకర్‌ రెడ్డి (52) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన రైతు సుధాకర్‌ రెడ్డి, ప్రతిభ దంపతులు వారికున్న భూమిలో వరి, వేరుశనగ పంటలు సాగుచేశారు. సుధాకర్ రెడ్డి వరిపంటకు నీరు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లి విద్యుతఘాతానికి గురయ్యాడు. భర్త ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో భార్య ప్రతిభ పొలం వద్దకు వెళ్లగా.. అప్పటికే రైతు సుధాకర్ రెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు. ఆ విషాదాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

స్థానిక రైతులు పోలీసులు, విద్యుత్ శాఖాధికారులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని అనంతపురం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఇదీ చదవండి

అర్ధరాత్రి తాతను చంపేసిన మనవళ్లు.. ఆస్తి కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.