అనంతపురం జిల్లా కదిరిలో రైతు సంఘం నేతలు నిరసన చేపట్టారు. ఇంటికే పరిమితమై.. పనుల్లేక నష్టపోయిన రైతులు, కూలీలను ఆదుకోవాలని కోరారు.
మండల పరిధిలోని వరిగిరెడ్డిపల్లి ప్లకార్డులతో రైతులు, రైతు సంఘం నాయకులు దీక్షలు చేపట్టారు. కూలీలు, రైతు కుటుంబాలకు 7500 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.