అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో ఉగ్రప్ప అనే రైతు... తన పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసేందుకు రైతు ఉగ్రప్ప అప్పు చేసి మూడు బోర్లు వేయించాడు.
వీటితో పాటు తన అనారోగ్యానికి చికిత్స ఖర్చు నిమిత్తం.. 6 లక్షల 40 వేల రూపాయలు అప్పు చేశాడు. దిగుబడి లేక... అప్పు తీర్చలేక.. మరోపక్క అనారోగ్యంతో సతమతమై ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెప్పారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: