Family Agitation In Anantapur: అక్రమ రిజిస్ట్రేషన్ చేసి తమ ఆస్తిని వేరొకరికి బదిలీ చేశారని ఆరోపిస్తూ ఓ కుటుంబం అనంతపురం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. అనంతపురం గ్రామీణ మండలం కక్కలపల్లి గ్రామ పరిధిలోని తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని,.. ఆ పత్రాలను ఫ్లెక్సీపై ముద్రించి బాధితులు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయించాలని బాధితుల బంధువులు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు చేపట్టారు. దీంతో కొద్దిసేపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
బాధితులు తప్పు జరిగిందని ఆందోళన చేస్తున్నప్పటికీ.. ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. అవేవీ పట్టించుకోకుండా పోలీసులను పిలిపించారు. బాధితులను పోలీసులు ఈడ్చి పడేయటంతో మహిళ తలకు తీవ్ర గాయమైంది. రక్తం కారుతున్నా కనీసం ప్రాథమిక వైద్యం కూడా చేయించకుండా బాధితులను పోలీసులు నాల్గో పట్టణ స్టేషన్కు తీసుకెళ్లారు. విచారణ పేరుతో బాధితుల సెల్ఫోన్లు లాక్కొని, స్టేషన్లో కూర్చోపెట్టడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: