ETV Bharat / state

Fake Votes Registration: జాబితాలో దొంగ ఓట్లు..! అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికిన అధికారులు

Bogus Votes in Raptadu: ఇంటి నంబరు లేకుండానే వందల ఓట్లు..! ఎవరూ లేని శిథిలావస్థ గుడిసెలో 47, మరో ఇంట్లో 181.. ఇలా ఒక్కటేమిటి..! 2వేల 498 దొంగ ఓట్లు జాబితాలో వచ్చి చేరాయ్‌..! అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఓటర్ల జాబితాలో వెలుగు చూసిన భారీ అక్రమాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 27, 2023, 8:27 AM IST

Fake Votes Registration in Anantapur : అది అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ప్రసన్నాయపల్లి. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి నంబర్ 1-1. అందులో నివాసముండే కుటుంబం పదేళ్ల క్రితం వలస వెళ్లిపోయింది. అయితేనేం ఇందులో 47 మంది ఓట్లర్లు ఉన్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది శింగనమల నియోజకవర్గంలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు. కళాశాల పేరుతో 2019 ఎన్నికల ముందు 21 ఓట్లు చేర్చారు. కళాశాల చుట్టుపక్కల గృహాలే లేవు. ఆ ఓట్లను ఇప్పటికీ తొలగించలేదు.

నియోజకవర్గంలోనూ ఇంటి నంబరు లేని ఓటర్లు 15 వందల6 మంది ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే '00' ఇంటి నంబర్‌తో రాచానపల్లిలో 208 ఓట్లు, కక్కలపల్లికాలనీ పంచాయతీలో 186, పాపంపేట పంచాయతీలో 236, కురుగుంట పరిధిలో 80 ఓట్లు నమోదయాయ్యి. ఇలా సుమారు 2 వేల 498 ఓట్లు నమోదు చేశారు. మరో వైపు తప్పుడు నంబర్లతోనూ వేలాదిగా జాబితాలో చేర్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10 కంటే ఎక్కువ ఓట్లు కలిగిన ఇళ్లు 958 ఉన్నాయి. వీటిలో దాదాపు 60 శాతం సుమారు 10 వేల వరకు దొంగ ఓట్లు నమోదు చేసినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. ఇంటి నంబర్‌ లేకుండా నమోదు ఎలా చేస్తారనే దానిపై అధికారుల వద్ద సమాధానం లేదు. సాంకేతిక తప్పిదాల వల్ల జరిగి ఉంటుందని మండల రెవెన్యూ అధికారులు సమాధానం దాటవేస్తున్నారు..
Fake votes: విచ్చలవిడిగా దొంగఓట్లు నమోదు.. ఒకే ఇంట్లో ఏకంగా 47

అధికార పార్టీ నేతలకు వత్తాసు : కీలక నియోజకవర్గమైన రాప్తాడు అభ్యర్థి గెలుపును అనంతపురం గ్రామీణ మండలం ఓట్లు నిర్ణయిస్తాయి. ఈ మండలంలోని 21 పంచాయతీలు అనంతపురం నగరంతో కలిసిపోయి 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. నగరంలో ఉండే వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్లను ఆయా పంచాయతీల జాబితాలోనూ చేర్చారు. నగరంలో కలిసిపోయి ఉండటంతో దొంగ ఓటర్లను గుర్తించడం అంత సులువు కాదు. కొందరు అధికారులు, వాలంటీర్లు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ దొంగ ఓట్లు సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Bogus Votes in AP: ఇబ్బడిముబ్బడిగా బోగస్‌ ఓట్లు.. ఏ బూత్​ చూసినా అవే

కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తుల్లో టీడీపీ అనుకూలంగా ఉన్నవాటిని పలుచోట్ల తిరస్కరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్లు మరణించినా వివాహాలు చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లనూ అలాగే ఉంచుతున్నారు. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తొలగించడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

రాప్తాడులో ఓటర్ల జాబితా తయారీలో చెప్పినట్లు వినడం లేదని ఉప తహశీల్దార్‌ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. తమకు అనుకూలంగా ఉండే మరో అధికారిని నియమించుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Fake votes: ఇల్లే లేదు.. అయినా 103 ఓట్లు.. అడ్డగోలుగా ఓటర్ల నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.