అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. వీరాంజనేయ కొట్టాల గ్రామంలో వెయ్యి లీటర్లకు పైగా నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం షాపులు మూతపడటంతో నాటుసారా కేంద్రాలు పెరిగాయని ఎక్సైజ్ సీఐ హరికృష్ణ తెలిపారు.
ఇవీ చదవండి.. అనుమానాస్పద స్థితిలో దంపతుల బలవన్మరణం